ఆ గిరిజన గ్రామంలో సుస్తీ చేస్తే డోలీ తప్పదు..
Ens Balu
2
కొత్తకోట
2020-09-01 09:18:40
ఆ.. గిరిజన గ్రామంలో ఎవరికి జ్వరమొచ్చినా రోగిని డోలీలో మోసుకు రావాల్సిందే...ఆ గ్రామానికి పారామెడికల్ సిబ్బంది సక్రమంగా వెళ్లరు...వెళ్లినా వారానికో, 15రోజు ల కొకసారో వెళతారు..దీంతో ఈ ప్రాంతంలోని గిరిపుత్రులు వైద్య సహాయానికి నోచుకోవడం లేదు..ఏదో వారికి తోచిన ఆకుపసరలు మింగి ఆరోగ్యాన్ని అనారోగ్యంతోనే నెట్టుకొస్తున్నారు. మరీ రోగం వికటిస్తే డోలీ కట్టుకొని కొత్తకోట పీహెచ్సీకి తీసుకు వస్తారు. ఈ దారుణమైన పరిస్థి విశాఖజిల్లా, రావికమతం మండలం శివారు గిరిజన గ్రామాలైన చలిసింగం, చీమలపాడు పంచాతీ గిరిజనుల దుస్తితి. మలేరియా జ్వరంతో గత వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న గిరిజనుడిని వైద్యం కోసం కొత్తకోట ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు డోలీ కట్టి తీసుకువచ్చారు. ఆ గ్రామ గిరిజనులు. ఏళ్ల తరబడి రావికమతం మండలంలో పలు గిరిజన గ్రామాల గిరిజనులు ఇదే కష్టాన్ని ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ గిరిజనులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించక లేకపోతున్నారు. దీంతో గిరిజనులకు అత్యవసర సమయంలో ఈ డోలీమోత తప్పకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు తమ ఆవేదన మీడియా ముందు వెళ్లగక్కారు. వారి గ్రామాలకు వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతాలకు 108 వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. వెరసీ ఎలాంటి అనారోగ్యానికి గురైనా గిరిజులు రోగిని ఆసుపత్రులకు తీసుకువెళ్లాలంటే డోలీమోత తో తీసుకువెళ్లాల్సిందే. ఇలా తీసుకు వస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే గిరిజనులు మ్రుత్యువా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు గ్రామాలను సందర్శించినప్పటికీ ఈ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 3 నెలల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రామలక్ష్మీని కొండపై నుంచి డోలీపై మోసుకువచ్చి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మరో మహిళకు పురిటినొప్పులు వచ్చి, తీవ్ర అస్వస్తతకు గురికావడంతో డోలీపై తీసుకువచ్చి కొత్తకోటలో వైద్య చికిత్స చేయించారు. ఇలా డోలీ మోతతో ఎన్నాళ్లు కష్టాలు అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తే తప్పా తమ గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, రోడ్డు సౌకర్యం వచ్చేటట్టు లేదని గిరిజనులు చెబుతున్నారు...