ఐసిడిఎస్ లో ఉద్యోగాలకి ధరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
4
రావికమతం
2020-09-01 09:35:00
రావికమతం ఐసీడీఎస్ పరిధిలోని రావికమతం మండలంలోని ఖాళీగా వున్న రెండు అంగన్‌వాడీ కార్యకర్తలు, అయిదు హెల్పర్ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు పదిలోగా మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో వి.మంగతాయారు తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కార్యకర్త పోస్టులు పెదపాచిల(ఓసీ), పోతులూరు (ఓసీ), హెల్ప్‌ర్ (ఆయా) పోస్టులు తట్టబంద (ఎస్టీ), పీ.పొన్నవోలు (బీసీ-బీ), దొండపూడి-3(ఓసీ), చీమలపాడు (ఓసీ), చినపాచిల-2 (ఓసీ), మర్రివలస-గొల్లలపాలెం (ఎస్సీ), లకు రిజర్వు చేయబడ్డాయని ఆయా పోస్టులకు ఆర్హులైన అభ్యర్థులు ఈ నెల 1 నుంచి 9వ తేదీ లోపుమీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు రావికమతంలోని సీడీపీవో ఆఫీస్‌ను సంప్రదించాలని సీడీపవో మంగతాయారు చెప్పారు. ఆశక్తివుండి విద్యార్హతలున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.