వాట్సప్ సందేశానికి స్పందించిన కలెక్టర్..
Ens Balu
5
Guntur
2021-06-18 15:57:11
ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పరిష్కారం కోసం ఎన్నొ సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న మానసిక వికలాంగురాలుకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చొరవతో మండలస్థాయి అధికారులు వికలాంగురాలు ఇంటికే వెళ్ళి ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే దాచేపల్లి మండలం నారాయణ పురం గ్రామంలో∙బొడ్డు చిన్నా (28) పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. మంచానికే పరిమితమైన బొడ్డు చిన్నా అక్క శాంతి లక్ష్మీ అన్నీ బాగోగులు చూసుకుంటుంది. చెల్లెలు బొడ్డు చిన్నాకు ఆధార్ కార్డు ఎన్రోల్ చేసినప్పటికీ ఆధార్ కార్డు సాంకేతిక కారణంగా జారీ కాలేదు. ఆధర్ కార్డు యాక్సిస్ కానందున ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా ఉంది. ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పరిష్కారం కోసం అక్క శాంతి లక్ష్మీ గ్రామం సమీపంలోని ఆధార్ సెంటర్లుకు ఎన్నో సార్లు తీసుకు వెళ్లినా సెంటరు నిర్వహకులు ఆధార్ కార్డు నమోదుకు తిరస్కరించారు. ఈ విషయమై సహాయం చేయాల్సిందిగా శాంతి లక్ష్మీ శుక్రవారం (18.06.2021) ఉదయం సామాజిక మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారి దృష్టికి తీసుకు రావటం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బొడ్డు చిన్నా ఆధార్ కార్డు సాంకేతిక సమస్యను పరిష్కరించాలని దాచేపల్లి మండలం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం దాచేపల్లి మండల ఇన్చార్జి తహశీల్దారు వెంకటేశ్వర నాయక్ రెవెన్యు నారాయణపురం గ్రామంలోని బొడ్డు చిన్నా ఇంటికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగురాలు బొడ్డు చిన్నాను సమీప మీ సేవా కేంద్రానికి తీసుకువెళ్ళి ఆధార్ ఆధార్ కార్డు ఎన్రోల్ చేయటం జరిగింది. పది చేతివేళ్ళుకు గాను తొమ్మిది చేతి వేళ్ళు క్యాప్చర్ చేయబడింది. ఈ సందర్భంగా అక్క శాంతి లక్ష్మీ మాట్లాడుతూ తన చెల్లెలి ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పరిష్కారం కోసం 2013 సంవత్సరం నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎంతో మంది అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా, ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి శుక్రవారం ఉదయం సామాజిక మాధ్యమం ద్వారా సమస్యను తెలియచేసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మానవతా దృక్పథంతో అధికారులనే ఇంటికి పంపి మా చెల్లెలు ఆధార్ కార్డు సమస్యను పరిష్కరించినందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.