కోవిడ్ రెండోదశలో రోగులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా బ్యాంక్ ఆఫ్ బరోడా జిల్లాకు అయిదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చింది. ఈ మేరకు శనివారం ఉదయం కలెక్టరేట్‌లో బ్యాంకు ప్రతినిధులు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. కోవిడ్ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న బాధితులకు ప్రాణవాయువును అందించేందుకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం) ఎ.భార్గవ్ తేజ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమహేంద్రవరం యూనిట్ రీజనల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్, చీఫ్ మేనేజర్ పి.పకీర్, క్రెడిట్ మేనేజర్ ఎం.కృష్ణమోహన్, మేనేజర్లు ఎం.చిన్నారావు, పి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
(సమాచార శాఖ జారీ)
........................
.........................
పత్రికా ప్రకటన
కాకినాడ, జూన్ 19, 2021
రాక్ సిరామిక్స్ సంస్థ జిల్లాకు సామాజిక బాధ్యతగా నాలుగు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు శనివారం ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని కలిసి కాన్సంట్రేటర్లను అందించారు. కోవిడ్ రోగులకు చికిత్స సమయంలో ఆక్సిజన్‌ను అందించేందుకు ఉపయోగపడే కాన్సంట్రేటర్లను అందించిన రాక్ సిరామిక్స్‌కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. రూ.5 లక్షల వ్యయంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు పీపీఈ కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు, సోడియం హైపో క్లోరైట్ తదితరాలను అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, సంస్థ వైస్ ప్రెసిడెంట్-ఆపరేషన్స్ ఎస్ఎస్ యాదవ్, హెచ్ఆర్ హెడ్ నీరజ్ కుమార్, ఈహెచ్ఎస్ మేనేజర్ పి.బాలాజీ, పీఆర్ మేనేజర్ వీజీఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.