6వరకూ బంగారమ్మ తల్లి దర్శనాలు..
Ens Balu
5
Simhachalam
2021-06-19 14:40:01
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థాన ఉపాలయం బంగారమ్మఅమ్మవారి వార్షిక గ్రామ పండగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల వరకూ దర్శనాలు కల్పిస్తామని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం కల్పించాలని నిర్ణయించామన్నారు. శనివారం ఈ మేరకు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఈఓ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడుతూ, పండగ రోజు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్ల పర్యవేక్షణకు అవసరమయ్యే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కరోనా కేసులు అధికంగా వున్నందున భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ఈఓ తెలియజేశారు.