ఐటిడిఏ పీఓకి శస్త్ర చికిత్స..


Ens Balu
1
Parvathipuram
2021-06-19 14:51:15

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి కూర్మనాధ్ కు ఉదయం ఏరియా ఆసుపత్రిలో డి.సి.హెచ్.ఎస్ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆర్.కూర్మనాథ్ ప్రోజెక్ట్ అధికారికి వీపు పై ఫెవిషి యష్ సిస్త (చిన్న కాయ) సుమారు 30 నిమిషాల పాటు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆధికారి మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రిలో  శస్త్ర చికిత్స నిర్వహించేందుకు ఆధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయని, చాలా త్వరగా శస్త్ర చికిత్స  నిర్వహించారని, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు సేవలు అందించు నిమిత్తం ఉన్న ఆధునాతన పరికరాలు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు  అందుబాటులో ఉన్నాయని సామాన్య ప్రజలు ఈ సేవలను వినియోగించు కావాలని హితవు పలికారు.
సిఫార్సు