పీహెచ్సీలో వైద్యసేవలు మెరుగుపరచాలి..


Ens Balu
3
Minumuluru
2021-06-19 15:25:14

విశాఖ ఏజెన్సీలోని అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా గరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందాలని ఐటిడిఏ పీఓరోణంకి గోపాలకృష్ణ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం పీఓ  మినుములూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వున్న పిహెచ్సి డా. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంతవరకు మండలంలోని ఎన్ని గ్రామాలవారికి కోవిడ్ టీకా లు వేసారని ఆరా తీశారు. ఇంతవరకూ 4,000 మందికి వేసామని డాక్టర్ పీఓకి వివరించారు. హాజరు పట్టిక చూసి ఈ రోజు విధులకు ఎంతమంది వచ్చారో వారిని పేరు పేరునా పిలచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ, గిరిజనులకు వైద్యసేవలు అందించడంతోపాటు, పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల గిరిజనులకు, 0-5 పిల్లల తల్లులకు వేక్సిన్ అందించాలన్నారు. ఈ విషయంలో స్థానిక సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు.

సిఫార్సు