ఉపాది పనులతో గిరిజనులకు లబ్ది..


Ens Balu
3
Paderu
2021-06-19 15:30:25

విశాఖ మన్యంలోని అన్ని గిరిజన గ్రామాల్లో ఉపాది పనులతో గిరిజనులకు లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం వంట్లమామిడిలో ఉపాధి హామి పధకం క్రింద వంట్ల మామిడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేపట్టిన వ్యవసాయ భూమి చదును పనులు 15 ఎకరాల విస్తీర్ణంలో జరుగుచున్న పనులను ఆయన పరిశీలించారు. అక్కడ వున్న ఉపాధి కూలీలతో మాట్లాడుతూ  SSS గ్రూపు లతో వున్నవారంతా పనులకు హాజరు కావలసినదిగా కోరారు. అనంతరం ఉద్యానవన తోటల పెంపకానికి సంబంధించి జీడి తోటలను క్షేత్ర స్థాయిలో స్వయంగా ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇఇ ట్రైబల్ వెల్ఫేర్ కుమార్,డిడి విజయ్ కుమార్ డిఇ అనుదీప్,ఎటిడ్ల్యు రజని తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు