వేక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ కావాలి..


Ens Balu
3
Sankhavaram
2021-06-19 15:47:15

శంఖవరం మండల కేంద్రంలో  ఆదివారం నిర్వహించే కోవిడ్ వేక్సినేషన్ విజయవంతం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎంపీడీఓ జె.రాంబాబు తెలియజేశారు.  శనివారం ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కరోనా కేసులు అధికంగా వున్న జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ అధిక సంఖ్యలో చేయాలని జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ఆదేశించార్నారు. దీనికోసం మండలంలోని అన్ని గ్రామసచివాలయాల సిబ్బందిని, ఐసిడిఎస్ సిబ్బందితో ముందస్తుగా అప్రమత్తం చేశామన్నారు. ఆదివారం ఒక్కరోజే 250 మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఎంపీడీఓ చెప్పారు. 

సిఫార్సు