గ్యాసిఫికేషన్ కోసం రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు
Ens Balu
1
New Delhi
2020-09-01 10:54:01
భూగర్భంలోని బొగ్గును మండించి విద్యుత్ ను ఉత్పత్తి చేసే గ్యాసిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి 2030 నాటికి 10కోట్ల టన్నుల బొగ్గు వినియోగ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫ్యాక్షన్ ప్రక్రియలపై న్యూఢిల్లీలో నిర్వహించిన వెబినార్ సదస్సునుద్దేశించి ప్రహ్లాద్ జోషి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గ్యాసిఫికేషన్ కోసం 4లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడతామని బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫాక్షన్ అనేది ఆశ, అత్యాశ కాదని, ప్రస్తత అవసరమని అన్నారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు గ్యాసిఫికేషన్ కోసం వినియోగించే బొగ్గు రెవెన్యూ వాటాపై 20శాతం రాయితీని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. యూరియా, తదితర రసాయనాల తయారీ కోసం సింథటిక్ సహజవాయు ఇంధనం, శక్తి ఇంధనం వంటివి ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అధ్యక్షతన ఒక సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించిన మంత్రి బొగ్గు మంత్రిత్వ శాఖకుచెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు.
గ్యాసిఫికేషన్ కు సంబంధించి మూడు ప్లాంట్లు నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.) సంస్థ ఏర్పాటు చేయనుందన్నారు. దంకుని ప్లాంట్ కు అదనంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ (బి.ఓ.ఓ.) ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్త టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సింధటిక్ సహజవాయువు మార్కెటింగ్ కోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)తో అవగాహనా ఒప్పందాన్ని కూడా సి.ఐ.ఎల్. కుదుర్చుకుందని వివరించారు..