ప్రజల వినతులను తక్షణమే పరిష్కరించాలి..
Ens Balu
2
Denkada
2021-06-21 13:51:43
ప్రజల నుంచి వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా సత్వరం పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు(ఆసరా) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ మండలంలోని జొన్నాడ గ్రామ సచివాలయాన్ని జె.సి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు, ప్రజా వినతుల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రజా వినతుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులపై ఆరా తీశారు. అంతకుముందు మండలంలోని మోదవలసలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర భవనాలను భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా పరిశీలించి వాటిని త్వరగా పూర్తిచేయాలని ఎంపిడిఓ స్వరూపరాణి, ఏ.ఇ.లను ఆదేశించారు. మండలంలో ఉపాధి అనుసంధాన నిధులతో చేపడుతున్న భవన నిర్మాణాల ప్రగతిపై వారితో సమీక్షించారు.