ఐటిడిఏ కార్యాలయ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు


Ens Balu
2
Paderu
2020-09-01 12:52:57

పాడేరు  ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్  సలిజామల  వ్యక్తిగత సిబ్బంది , క్యాంప్ కార్యాలయం సిబ్బందికి మంగళవారం క్యాంపుకార్యాలయంలో కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం పీఓ కూడా కుటుంబ సమేతంగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించినట్టు పిఓ వెల్లడించారు. టెస్టులు అనంతరం ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా నిత్యం మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. సాధ్యమైనం త వరకూ ఎవరికీ షేక్ హేండ్ ఇవ్వకూడదన్నారు. అంతేకాకుండా కార్యాలయానికి వచ్చినపుడు, ఇంటికి వెళ్లిన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మాస్కులు కూడా వాడిన మాస్కునే ప్రతీరోజూ వాడకూడదన్నారు. ఉతుక్కోవడానికి వీలుగా ఉన్న మాస్కులు వాడుతూ, వాటిని మళ్లీ పరిశుభ్రం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో  డా. ప్రవీణ్ వర్మ, డా.ప్రవీణ్ ,హెల్త్ సహాయకులు సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.