శంఖవరం మండలంలోని అర్హులైన మహిళా శక్తి సంఘాల్లోని 2,131 మంది సభ్యులకు వైఎస్సార్ చేయూత పధకం కింద రూ . 4 కోట్లను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణి చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ క్రాంతి పధం పధకం మహిళా శక్తి సంఘాల్లోని ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ సామాజిక వర్గాల్లోని 45 - 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన వారికి ఏడాదికి ఒక సారి రూ .18,750 చొప్పున ప్రభుత్వం అందించే ఈ ఆర్ధిక సహాయం రెండో ఏడాది నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసారు. వైఎస్సార్ క్రాంతి వపధం తుని ఏరియా కోఆర్డినేటర్ షేక్ మహబూబ్ వల్లీ, ఎంపీడీఓ రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు లచ్చబాబులు సంయుక్తంగా మండల మహిళా సంఘం ప్రతినిధులకు అందించారు . ఈ సందర్భంగా ఈ అధికారులు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సొమ్ములతో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబం ఆదాయాన్ని పెంచు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ క్రాంతి పధం పధకం ఇంచార్జ్ ఏపి ఎం . జీవీ.ప్రసాద్ , కత్తిపూడి సీసీ సీత , శంఖవరం సీసి నాగలక్ష్మి వివోఏలు , సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.