పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్..


Ens Balu
2
Mummidivaram
2021-06-22 14:24:41

భూరికార్డులను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ముమ్మిడివరం మండల తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న భూమి యొక్క రికార్డులను స్కానింగ్ చేసే ప్రక్రియను అమలాపురం ఆర్డీవో ఎన్ ఎస్ వి బి వసంతరాయుడుతో కలిసి జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా  డిజిటలైజేషన్ చేస్తున్న సిబ్బందిని స్కానింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. రికార్డులను స్కానింగ్ చేసే విధానం, స్కాన్ చేసిన డాక్యుమెంట్లను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసే విధానం, డాక్యుమెంట్లు ప్రింటింగ్ చేసే విధానం పై సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. నాణ్యతతో కూడిన డిజిటల్ భూరికార్డులను అందించే విధంగా సిబ్బంది పనితీరు ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ఈ పరిశీలనలో ముమ్మిడివరం తహశీల్దార్ ఎస్. పోతురాజు, కంప్యూటర్ ఆపరేటర్లు, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు