మహిళలకు అండగా YSRచేయూత..


Ens Balu
1
గంట్యాడ
2021-06-22 15:09:56

వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఎంత గానో ఉపయోగపడుతుందని వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. మంగళవారం 64 వార్డు గొడ్డువానిపాలెం గ్రామంలో వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆద్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరముల నుండి 60 సంవత్సరములు గల అక్క చెళ్ళమ్మలకు రెండవ విడతలో భాగంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ రూ. 18,750 లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసిన ఘనత ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే చెందుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందెందుకు సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారని, దళారీ వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలించారని అన్నారు. వార్డు ఇంచార్జ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగిరెడ్డి సహకారంతో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వైఎస్ఆర్ చేయూత అందిందని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా  ఉండేందుకు అనుకున్న సమయానికే పధకం మహిళలకు అనిదించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు. కార్య క్రమంలో పితాని అప్పన్న, మాధవ రావు, చిన్న, గొడ్డు శ్రీను, రమణ, గోందేసి రాము, దొర కొండ, శ్రీను, మహిళలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, యువకులు కార్య కర్తలు పాల్గొన్నారు.
సిఫార్సు