వైభవంగా బంగారమ్మ తల్లి పండగ..


Ens Balu
1
అడవివరం
2021-06-22 15:20:52

అడివివరం గ్రామదేవత శ్రీ శ్రీశ్రీ బంగారమ్మతల్లి వారి వార్షిక పండగ మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం నుండి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, రవికలు సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. పాత అడివివరంలోని అమ్మవారి సతకంపట్టు వద్దకు కూడా భక్తులు భారీగా తరలివెళ్లి మొక్కులుతీర్చుకున్నారు. అప్పన్న ధర్మ కర్తల మండలి ప్రత్యెక ఆహ్వా నీతులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. పైడితల్లమ్మ వారి దేవాలయంలో కూడా మారువారం పూజలు సంప్రదాయంగా జరిగాయి. గతవారం వీలుపడని గ్రామస్థులు అమ్మవారికి ఈవారం మొక్కులు చెల్లించుకున్నారు. పైడితల్లమ్మ వారి పండగ సందర్భంగా గతవారం సమన్వయ లోపంతో తలెత్తిన ఇబ్బందులను ఈవారం ఈవో సూర్యకళ ప్రత్యక్షంగా పర్యవేక్షించి చక్కదిద్దారు.  కరోనా నేపథ్యంలో ఈవో ఆమె ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. అమ్మవారి సన్నిధిలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంతో పాటు బంగారుతల్లి యూత్ ఫ్రెండ్స్ ప్రతినిధులు భక్తులకు పొంగలి, పులిహోర, చక్కెరపొంగలి ప్రసాదాలను పంపిణీచేశారు. దేవస్థానం ఏ ఈఓ ఇజ్జిరోతు శ్రీనివాసరావు,సుపరింటెండెంట్ ముద్దాడ రమణ, సొసైటీ అద్యక్షులు కర్రిస్వామి స్థానిక నేతలు సతివాడ శంకరరావు దొంతల సంతోష్ ఇతర పెద్దలు, నక్క చందు పాల్గొన్నారు.
సిఫార్సు