అప్పన్న శాంతించిన వేల కుంభవృష్టి..
Ens Balu
2
Simhachalam
2021-06-23 05:05:57
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారు శాంతించారు. మూడోవిడత చందన సమర్పణకు ముందు శ్రీవారు కరుణించారు. ఫలితం కుంభవృష్టి వర్షం. భారీ వర్షంతో సింహాచల క్షేత్రంతోపాటు విశాఖ మహానగరం కూడా సేదతీరింది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న విశాఖవాసులు భారీ వర్షాలకు ఊపిరి పీల్చుకున్నారు. చందన స్వామి తెచ్చిన చల్లదనంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీఏటా అప్పన్నకు చందనం సమర్పించే సమయంలో వర్షాలు కురుస్తుంటాయని దేవస్థాన ఆచార్యులు పేర్కొన్నారు. స్వామి సాంతించడం ద్వారా ఈవిధంగా వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. ప్రతీఏటా వర్షాలు కురవడం కోసం సింహాచల క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక హోమాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.