ఉద్యాన పంటలతోనే గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఐటిడిఏ కూర్మనాథ్ పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు తన కార్యాలయంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఉద్యాన శాఖ, సబ్ ప్లాన్ మండలాల పి.ఓ లు, ఉద్యాన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటలపై నేటికీ నిర్వహిస్తున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు పొందిన లబ్ధిదారులు అందరికి ఉద్యాన పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అందులో భాగంగా రేపటి నుండి సబ్ ప్లాన్ మండలాలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని లబ్ధిదారులు గ్రామ సభలకు హాజరయ్యే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ సభలో ఉద్యాన పంటలపై లబ్ధిదారులు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం జూలై 1 వ తేదీ నుండి జీడి మామిడి, జామా, మామిడి మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాలని . అందు నిమిత్తం ప్రతి మండలంలో మండల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పి. ఎ లు, పి.ఓ లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు సమన్వయంతో విధులు నిర్వహించి లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉద్యాన ఆధికారులు మొక్కలు పరీక్షించి మేలుజాతి మొక్కలు లబ్ధిదారులకు అందజేయాలని, జూలై 30 నాటికి జియో టేగింగ్ పూర్తి కావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఎ.పి.డి శ్రీహరి, పి.హెచ్.ఓ. చిట్టిబాబు, సబ్ ప్లాన్ మండలాల ఉద్యాన ఆధికారులు, పి.ఓలు తదితరులు పాల్గొన్నారు.