విధినిర్వహణలో అలక్ష్యం వహిస్తే చర్యలు..
Ens Balu
3
2021-06-25 17:18:18
గ్రామసచివాలయ సిబ్బంది విధినిర్వహణలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టరు ఇలాక్కియా తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం కోరుకొండ మండలంలోని కొటికేశవరం, శ్రీరంగపట్నం 1,2, గ్రామసచివాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహిచారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సచివాలయాల్లో సర్వీసు రిక్వస్టులు పరిష్కార సరళిలో చాలా జాప్యాలున్నాయన్నారు. ప్రజలకు సచివాలయాల ద్వారా సేవలు సత్వరమే అందించాలన్నారు. దరఖాస్తులను పెండింగ్ ఉంచడం,పరిష్కరించే క్రమం సక్రమంగా లేవన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి అందించడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలన్నారు. ఎప్పటి కప్పుడు మండల అధికారులు కూడా సచివాలయాలను సందర్శించి ఇక్కడ సేవలు ప్రజలకు ఏవిధంగా అందుతున్నాయో గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దారు పాపారావు, ఎంపిడిఓ నరేష్‌కుమార్ తదితరులు పాల్గోన్నారు.