సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్..


Ens Balu
4
Samarlakota
2021-06-26 09:08:16

ప్రజలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో అందించడానికి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ సెంటర్లను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. భవన నిర్మాణ పక్షోత్సవాలు లో భాగంగా శనివారం సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గ్రామ సచివాలయం 1 మరియు 2  జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. సచివాలయం 1 కి సంబంధించి నోటీస్ బోర్డ్ లో పెట్టిన లబ్ధిదారులు లిస్టు లను పరిశీలించారు అలాగే హాజరు బయోమెట్రిక్ లేకపోవడంపై ఆరా తీయగా కరోనా వల్ల  హాజరు పుస్తకం ద్వారా  తీసుకుంటున్నట్టు తెలిపారు. సెక్రెటరీ లేకపోవడం గమనించి కలెక్టర్ సిబ్బందిని అడగ్గా సెక్రెటరీ సెలవు పెట్టి వెళ్లారని తెలిపారు. ఉండూరు గ్రామంలో ఖాళీ స్థలాల గురించి తాసిల్దార్ జితేంద్ర ను కలెక్టర్ ప్రశ్నించగా బ్రహ్మానంద పురం లో ఖాళీ స్థలాలు ఉన్నాయి అని లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అక్కడ కేటాయిస్తున్నట్లు కలెక్టర్ కు వివరించారు. అనంతరం సచివాలయ 2 ను పరిశీలించారు అక్కడ నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని, వెల్ సెంటర్ ను, సచివాలయ భవనాల పనులను పరిశీలిం చారు. పనులు వేగవంతం చేసి త్వరలోనే  భవనాలు ప్రారంభించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు