కాకినాడ పట్టణ పరిధిలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఇల్ల స్థలం మంజూరైన ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో భాస్కర్ నగర్ 4వ వార్డు (బి), సీతారామనగర్ 9 వార్డు (ఏ) పట్టణ సచివాలయలను కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గృహ నిర్మాణాల పురోగతి, దిశా యాప్, 90 ఈ రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు, అందిస్తున్న సేవల వివరాలు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు ఇల్ల స్థలాలు ఇచ్చేందుకు మంచి లేఔవుట్లును సిద్ధం చేసిందన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు అయిన ప్రతి ఒక్క లబ్ధిదారుని చేత గృహ నిర్మాణం చేపట్టించి గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. వార్డు సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ దిశా చట్టం, దిశ యాప్ పై అవగాహన పెంపొందించుకోని, వార్డు పరిధిలో ఉన్న మహిళలు, యువతిలందరూ తమ మొబైల్ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా చైతన్యపరచాలన్నారు. ఆకతాయితనంగా చిన్నచిన్న వాటితోపాటు మహిళలు, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై దిశా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా చూడాలన్నారు. వివిధ సేవల నిమిత్తం వార్డు సచివాలయానికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ ఏడిసి సిహెచ్.నాగనరసింహారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.