గిరిజనులకు మంచి వైద్యసేవలు అందాలి..
Ens Balu
3
Paderu
2021-06-26 11:44:16
రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల చేస్తుందని పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల కృష్ణ తెలిపారు. శనివారం జిల్లా ఏరియా ఆసుపత్రిని పీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం అధిక నిధులు ఖర్చు పెడుతున్నట్లు పిఓ తెలిపారు. గిరిజనుల కు వైద్య సేవలు సకాలంలో అందించాలని ,ఏ ఒక్కరికీ వైద్యం అందలేదని తమకు ఫిర్యాదు అందకూడదని పిఓ స్పష్టం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కి వైద్య సిబ్బందిని పంపించి మలేరియా,డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా నిత్యం పర్యవేక్షణలో వుండాలని ఆయన తెలిపారు. రాబోయేది వర్షాకాలం జాగ్రత్త వహించాలని ప్రతీ గ్రామానికి వెళ్లి స్ప్రేయింగ్ చేయించాలని మలేరియా అధికారులను ఆదేశించారు. అంతకుముందు పిఓ ఆసుపత్రి లో ఉన్న పరికరాలు,మందులు వున్న గదులను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో వున్న రోగులను పరమార్శించి ఏఏవ్యాధులకొరకు వైద్యం తీసుకుంటున్నారో పేషంట్లను అడగి తెలుసుకున్నారు. అక్కడ విధులకు హాజరైన వైద్యులతో మాట్లాడి విధులలో నిర్లక్ష్యం చేయకూడదని వైద్యసేవలు సకాలంలో అందించాలని ప్రజలు వైద్య నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ఆయన అన్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి ఈరోజు ఎంతమంది విధులకు హాజరయ్యారో వివరాలు తెలుసుకున్నారు.