శ్రీ పద్మావతి అమ్మవారికి పవిత్ర సమర్పణ
Ens Balu
2
Tiruchanur
2020-09-01 19:12:40
తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్య అర్చన చేపట్టారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యా హ్నం 12.30 గంట వరకు పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకా రానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. కాగా సాయంత్ర 6.00 నుండి 7.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, కంకణభట్టార్ మణికంఠస్వామి, సూపరింటెండెంట్ మల్లీశ్వరి పాల్గొన్నారు.