గ్రామ సచివాలయ మహిళా పోలీసు ప్రమోషన్ పై తీవ్ర వ్యతిరేకత..


Ens Balu
6
Tadepalli
2021-06-27 02:23:09

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలను జీఓఎంఎస్ నెంబరు 59తో వారిని కూడా సాధారణ పోలీసులు(కానిస్టేబుల్స్ తో సమానం) గా మార్చింది. ఇంత వరకూ బాగానే ఉన్నా వీరికి ఇన్ సర్వీసులో వచ్చే ప్రమోషన్ లో విషయంలో రాష్ట్రంలోని మహిళా పోలీసులంతా ఆదిలోనే పెదవి విరిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లమా విద్యార్హతో ఉద్యోగంలోకి చేరిన వారికి సైతం ఇన్ సర్వీసులో ప్రభుత్వ ఖర్చుతో యూనివర్శిటీల్లో డిగ్రీలు చదివించి ఆపై వెంటనే మండల  అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్లుగా  ప్రమోషన్లు ఇస్తోందని.. అలాంటిది తాము వస్తూ వస్తూనే డిగ్రీ, ఆపై విద్యార్హతలతో మహిళా పోలీసు ఉద్యోగాల్లోకి వచ్చినా సాధారణ కానిస్టేబుల్స్ మాదిరిగానే తమను ప్రభుత్వం గుర్తించడం ఏం బాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణ పోలీసుల విద్యార్హత ఇంటర్ ఉన్నావారికి హెడ్ కానిస్టేబుల్, డిగ్రీ, అంతకంటే అర్హతున్నవారికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషనేనా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ అర్హతున్న తమకు డిపార్ట్ మెంటల్ టెస్టులు పెట్టి కనీసం ఎస్ఐ ప్రమోషన్ అయినా ఇవ్వాలనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలోని మహిళా పోలీసులంతా డిగ్రీ విద్యార్హతతో వున్నవారే. ఇందులో అతి తక్కువ మంది మాత్రమే 45 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఉన్నారు. మిగిలిన వారంతా 30ఏళ్ల లోపు వారే ఉన్నారు. దీనితో తమకు వయస్సు, విద్యార్హత రెండూ ఉన్నాయని, దిశ యాక్టు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలంటే మహిళా ఎస్ఐల అవసరం భివష్యత్తులో చాలా వుంటుందని, అదేదో తమకు ముందే బరోసా కల్పిస్తే బావుంటుందని చెబుతున్నారు.  అలాకాకుండా డిగ్రీ చదువుకున్నవీరికి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ రావాలంటే కనీసం ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఏఎస్ఐ కావాలంటే మరో ఏడేళ్లు సమయం పడుతుంది. ఆపై ఎస్ఐగా ప్రమోషన్ రావాలంటే తామంతా ఆ ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోతామని..ప్రభుత్వ విధానం తమకు ఏ మాత్రం సమంజసంగా లేదని చెబుతున్నారు.  వుందని తమకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించైనా..లేదంటే ఇన్ సర్వీసులో ఎస్ఐ నోటిఫికేషన్ తీసే సమయంలో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం గ్రామసచివాలయాల్లో పేరుకి మహిళా పోలీస్ ఉద్యోగమే అయినా.. ఐసిడిఎస్, హెల్త్, విలేజ్ లా అండ్ ఆర్డర్, కార్యాలయ విధులు, డిజిటల్ అసిస్టెంట్లకు సహాయం, విలేజ్ సర్వేలు, ఇలా సుమారు 10 నుంచి 15 ప్రభుత్వ శాఖల పనులు ప్రభుత్వం చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత గ్రామ, వార్డు సచివాలయాల్లో విధుల్లోకి చేరినపుడు అత్యధిక సమయం ఐసిడిఎస్ శాఖకు వెచ్చించడంతో తమకి ప్రమోషన్లు కూడా ఇదే శాఖలో వస్తాయని భావించామని, అయితే ప్రభుత్వం తమకు హోం డిపార్ట్ మెంట్ ద్వారా అపాయింట్ మెంట్లు ఇవ్వడంతో ఇపుడు అదేశాఖలో తమను సాధారణ పోలీసులుగా మార్చారని చెబుతున్నారు. ఈ విషయంలో చాలా మంది మహిళా పోలీలకు పోలీస్ డ్రెస్ వేసుకునే ఉద్యోగం నచ్చలేదని పెదవి విరుస్తున్నారు. ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన తమని  ప్రభుత్వం ప్రమోషన్ విషయంలో చాలా నిరాశకి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో ప్రతీరోజూ గంటల తరబడి డిబేట్లు జరగడం కూడా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే ఒక శాఖ ఉద్యోగమని చెప్పి సుమారు 10 ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు చేయిస్తుండటంతో చాలా మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి అంతకంటే మంచిగా ఉండి, జీతం వచ్చే ఉద్యోగాలకు మహిళా పోలీసులు వెళ్లిపోతున్నారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో మహిళా పోలీసుల ఉద్యోగాలు నేటికీ భర్తీ కాలేదు. భర్తీఅయిన చాలా చోట్లు చాలా మంది తమ ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోయారు. గ్రామ, వార్డు మహిళా సంరక్షా కార్యదర్శిలుగా వున్న వీరిని ప్రభుత్వం సాధారణ పోలీసులుగా మార్చినా వీరిలో సుమారు 60శాతానికి పైగా ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. 90శాతం ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో కూడా ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విద్యార్హతులు, ప్రమోషన్లపై పునరాలోచించాలని కోరుతున్నారు. మరికొందరైతే..ఈ తరహా ఉద్యోగాలు తాము చేయలేమని..దీనికంటే మంచి ఉద్యోగాలొస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా బయటకు వెళ్లిపోతామని సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే..రాష్ట్రప్రభుత్వంలో మహిళా పోలీసుల ద్వారా అందే సుమారు 10ప్రభుత్వశాఖకి అందించే సహాయం ఆగిపోతుంది. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా బంగం వాటిల్లుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా..లేదంటే ఉన్నోళ్లు ఉంటారు..పోయినోళ్లు పోతారు అని ధీమా ఉండిపోతుందా అనేది వేచిచూడాలి..!
సిఫార్సు