2నెలలుగా బీఎస్ఎన్ఎల్ లో జీతాల్లేవ్..
Ens Balu
4
Visakhapatnam
2021-06-29 02:27:14
భారతదేశంలోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు రెండు నెలలుగా మంజూరు కాని జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బిఎంఎస్,బిటీఈయూ జాతీయ అధ్యక్ష, కార్యదర్శిలు వివిఎస్ సత్యన్నారాయణ , ఆర్సీ పాండేలు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ప్రాణాలకు తెగింగి విధులు నిర్వహించారన్నారు. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని వివరించారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఇపుడు రెండు నెలల నుంచి జీతాలు కూడా అందలేదని చెప్పారు. కేంద్రం తక్షణమే స్పందించి పెండింగ్ లో వున్న రెండు నెలల జీతాలను తక్షణమే మంజూరు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. అదేవిధంగా వివిధ పద్దుల కింద రావాల్సిన 30వేల కోట్ల ను కూడా విడుదల చేయాలన్నారు. కేంద్రం బిఎస్ఎన్ఎల్ కి రావాల్సిన మొత్తాలను సకాలంలో విడుదల చేయకపోవుడంతో ఉద్యోగులతోపాటు, సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగా రెగ్యులైజేషన్, ఇతర నియామకాలతో పాటు న్యాయపరమైన డిమాండ్లును కూడా మంత్రి ద్రుష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లినట్టు వీరు వివరించారు.