పేదవాడి సొంతింటి కాల నెరవేర్చాలి..


Ens Balu
3
2021-06-29 12:50:50

ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సొంతింటి కళ సాకారం చేసేందుకు ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. జూలై 1 న నిర్వహించనున్న మెగా గ్రౌండింగ్ మేళాకు ముందస్త ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కొమరాడ మండలం కొమరాడ, గుమడ గ్రామాల్లో, పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో  హౌసింగ్ లేఅవుట్ ను, మంగళవారం ప్రోజెక్ట్ అధికారి సందర్శించారు, ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు అందించారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ జూలై 1న చేపట్టనున్న మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో పార్వతీపురం మండలంలో మంజూరైన 55 లేఅవుట్లలో, సొంత స్థలాలలో 207  మొత్తం 3165 మంజూరు కాగా అందులో 735 గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని మిగిలిన ఇళ్లు జూలై 1న గ్రౌండింగ్  అయ్యేలా ఆన్ని చర్యలు చేపట్టాలని, అలాగే కొమరాడ మండలంలో 25 లే అవుట్లులో 334 ఇళ్లు, సొంత స్థలంలో 2.141 ఇళ్లు మొత్తం 2475 మంజూరు అయ్యాయని, లబ్ధిదారులు   మెగా  గ్రౌండింగ్ మేళా ఇళ్లు నిర్మాణానికి ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని, మెగా మేళా ఒక పండగ వాతావరణంలో చేపట్టాలని ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు నిచ్చారు.
           కొమరాడ మండలం కొమరాడ గ్రామ సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవల పై ఆరా తీశారు, అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోటే నివాసం ఉండాలన్నరు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ  సమయపాలన పాటించాలని అన్నారు.  పిర్యాదుల సేకరణలో పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు.  ఈ క్రమంలో సిబ్బంది హజరుపట్టి, ప్రగతి నివేదికల పట్టిక తదితర రికార్డులు పరిశీలించారు, వోలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించు కోవాలని హితవుపలికారు. 

      ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎస్.వేంకటేశ్వరులు, పార్వతీపురం కొమరాడ ఎం.పి.డి.ఓలు, తహసీల్దార్లు, హౌసింగ్ ఇ.ఇ, గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు