కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి
Ens Balu
2
ఏజెన్సీ లక్ష్మీపురం
2020-09-01 20:48:00
కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు అన్నారు. మంగళవారం ఏజెన్సీలక్ష్మీపురం సచివాలంయలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు జతల ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామసచివాలయాల్లో పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఆవిషయాన్ని గుర్తించే ఈ సేవాకార్యక్రమం చేపట్టినట్టు ఆయన వివరించారు. కరోనా వైరస్ కేసులు విస్తరిస్తున్న సమయంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి గ్రామాలను చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో విశేషంగా కష్టపడుతున్నారని అన్నారు. అంతేకాకండా పారిశుధ్య పనులు నిర్వహించే సమయంలో చేతి గ్లౌజులు, కాలికి రబ్బురు బూట్లు లేకుండా చెత్త ఎత్తకూడదని సూచించారు. అదే సమయంలో మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం ఎక్కడా తేడా రాకుండా చేయాలన్న ఆయన చెత్తలేకపోతే, ప్రజల ఆరోగ్యం శుభిక్షంగా వుంటుందని చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు.