రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాతకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పధకంలో భాగంగా జూలై 1,3,4, తేదీలలో నిర్వహించే మెగా గ్రౌండిరగ్ విజయవంతం చేయడానికి కేత్రసాయి అధికారులు, గ్రామ వాలంటీర్లు లబ్దిదారులు బాగస్వామ్యంతో ప్రత్యేక చోరవ చూపాలని సబ్ కలెక్టరు ఇలాక్కియా ఆదేశించారు. మంగళవారం ఆమె గ్రామీణ మండల పరిధిలోని తోర్రేడు సీతానగరం మండలంలోని మునికూడలి, చినకొండేపూడి లేవుట్లలో పునాదులు త్రవ్వేందుకు మార్కింగ్, ఎలక్ట్రికల్ స్దంబాలు ఏర్పాటు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మరియు పారిశుద్ద్యశాఖ ద్వారా బోరు బావులు నిర్మాణాలు, తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ త్వరగా కనీస మౌలిక వసతులు గృహ నిర్మాణాల నిమిత్తం కల్పించి లబ్దిదారులను ప్రోత్సాహించి వారికి డ్వాకా ద్వారా అడ్వాన్ను రుణం మంజూరు చేయించి వెంటనే నిర్మాణాలు ప్రారంబింపజేయాలన్నారు. ప్రతి లబ్దిదారుడు గృహ నిర్మాణాలు తప్పకుండా చేపట్టేలా గ్రామ వాలంటీర్లు క్షేత్రస్దాయి అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశించారు. ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మానస పుత్రిక నవరత్నాలు` పేదలందరికి ఇల్లు కార్యక్రమమన్నారు. మెగా గ్రౌండిరగ్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఉండాలని ఆమె అన్నారు. పదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు నూటినూరు శాతం పాటుపడాలన్నారు. ప్రభుత్వం అందించే రూ 1,80,000లకు అదనంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో రూ 50 వేలు అడ్వాన్పు రుణం ఇప్పించి పక్కాగా ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సాహాన్ని లబ్దిదారులుకు అందించాలన్నారు. ఒక్కొక్కరు ఇల్లు నిర్మించుకోవాలంటే అయ్యేపనికాదని అందుకని 10 మంది నుంచి 25 మంది వరకు గ్రూపుగా ఏర్పడి ఇళ్ళ నిర్మాణాన్ని ఆరంబించేలా వాలంటీర్లు పంచాయితీ కార్యదర్శులు ప్రోత్సాహాన్ని అందించి ఉమ్మడిగా నిర్మాణాలు చేసుకుంటే లబ్దిదారులుకు మెటీరియల్ పరంగా, నిర్మాణ వ్యయాలు పరంగా ఖర్చులు తగ్గి ఎంతో మేలు చేకూరుతుందని ఆమె స్ఫష్టం చేసారు. ఇళ్ల నిర్మాణాలు విషయంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా లబ్దిదారులుకు అధికారులు బాసటగా నిలవాలని ఆమె అన్నారు. అదేవిధంగా జిల్లా స్దాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విద్యుత్, గ్రామీణ నీటి సరపరా, పంచాయితీ రాజ్ వంటిశాఖల సిబ్బంది అందుబాటులో వుండి వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు విద్యుత్ లైన్లు త్వరగా వేసి గృహ నిర్మాణాల కొరకు నీటి సరఫరా కొరకు ట్రాన్సుకో అధికారులు తోడ్పాటు నందించాలన్నారు.అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు బోరుబావులు 2 మాత్రమే పూర్తి చేసారని మూడవ బోరుబావిను వెంటనే త్రవ్వాలని ఆదేశించారు. మునికూడలి లేవుల్ చాలవరకు పునాదులుత్రవ్వి నిర్మాణాలు ప్రారంబించడం జరిగిందన్నారు. బొబ్బర్లంక ములక్లలంక గ్రామాలలో కూడా ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమాలలో తాహసిల్దార్లు పవన్ కుమార్. రియాజ్ హుస్సేన్. మండల పరిషత్ అభివృద్ది అధికారి మూర్తి, నోడల్ అధికారి, ఎడి మైనింగ్ రంగా కుమార్ కొంతమూరు ట్రాన్సుకో ఎ.ఇ కిశోర్ కుమార్. గ్రామ కార్యదర్శులు, గ్రామ రెవిన్యూ అధికారులు, గృహనిర్మాణ సంస్ద ఇంజనీర్లు వర్కు ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.