ఆర్బీకేలను సుందరంగా మార్చండి..
Ens Balu
6
Rayadurgam
2021-06-29 13:59:48
రైతు భరోసా కేంద్రాల సుందరీకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయదుర్గం నియోజకవర్గంలో ఆర్బీకేల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. నియోజక వర్గంలో ఆవుల దట్ల మండలంలోని ఉడైగోళం-74 గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులు.. రాయదుర్గం లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ అగ్రి క్లినిక్ ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. జులై 8న రైతుదినోత్సవం సందర్భంగా జిల్లాలో కొన్ని రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్నామన్నారు. ఆయా రైతు భరోసా కేంద్రాలను జులై 5 నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.రాయదుర్గంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుకు రూ.27.50 లక్షలు,నిధులతో నిర్మించిన భవన నిర్మాణ సముదాయాన్ని జూలై 8 వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సుందరీకరణ పనులు జూలై 5వ తేదీ లోపల పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా & రెవెన్యూ) నిశాంత్ కుమార్, పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాగ్యరాజ్, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత్ రెడ్డి , ఈ ఈ జవహర్ అస్లీ, డి ఈ రామ్మోహన్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.