గ్రామాలకి ప్రభుత్వ కార్యాలయాలొచ్చాయ్..
Ens Balu
6
Tadepalle
2021-06-30 02:17:30
అవును స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్. జగన్మోహనరెడ్డి చొరవ ముందుచూపుతో గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామాల రూపు రేఖలను మార్చేస్తుంది. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా 15వేల ఐదు గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీఎం గ్రామాలకే ప్రభుత్వ కార్యాలయాలొచ్చాయి. బ్రిటీషు కాలంలో నాడు అమాయక ప్రజలను హింసించడానికి సైనికులు తిరిగితే.. అదే నేడు గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించడానికి సచివాలయానికో మహిళా పోలీస్ చొప్పున 14964 మంది రక్షక బటులు గ్రామానికి రక్షణ కల్పిస్తున్నారు. గ్రామాభివ్రుద్ధికి కార్యదర్శి, భూములు పరిరక్షించడానికి వీఆర్వో, రైతులకు అండగా నిలవడానికి అగ్రికల్చర్ అసిస్టెంట్, మత్స్య సంపదను పెంచడానికి ఫిషరీష్ అసిస్టెంట్, సంక్షేమ పథకాలు అందించడానికి వెల్ఫేర్ అసిస్టెంట్, వాణిజ్య పంటలు పెంచే హార్టీకల్చర్ అసిస్టెంట్, పట్టు పరిశ్రమను రైతులకు పరిచియం చేయడానికి సెరీకల్చర్ అసిస్టెంట్, గ్రామాల్లో నిర్మాణాలను దగ్గరుండి చూడటానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్, భూముల భూముల లెక్క పక్కాగా చూపించడానికి సర్వేయర్, ఇలా 15శాఖల సిబ్బంది మొత్తం గ్రామంలోనే ప్రజలకు సేవలు అందిస్తే ఇంకేం కావాలి. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం అంటే ఏంటో ఆయన ఉద్యమం చేసిన రోజుల్లో బ్రిటీషు సేనల పోరాటంలో పేరు భారతీయులు వల్లె వేస్తుంటే నేటి.. స్వాతంత్య్ర భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా, ఒక్కో గ్రామంలో గ్రామ సచివాలయం, ప్రాధమిక వైద్యం అందించేందు విలేజ్ హెల్త్ క్లినిక్, రైతుల అన్ని అవసరాలు తీర్చేందుకు భరోసా కేంద్రం, పాడి పుశుల ఆరోగ్యం కోసం పశువుల ఆసుపత్రి ఇలా అన్ని రకాల సేవలు గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నాడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివ్రుద్ధికి ఆమడ దూరంలో వుండేది. ఇపుడు దేశవ్యాప్తంగా వున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ అందే సేవలపై అధ్యయనాలు చేసి.. వారి రాష్ట్రంలో ఏవిధంగా ప్రజలకు సేవలు అందించాలి అనే కోణంలో ఆలోచిస్తున్న రాష్ట్రాల్లొని అంది నోటి వెంట వచ్చే పదం... సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి... ప్రతీ ప్రజాసేవకు ముందు గ్రామసచివాలయం ఏర్పాటునే ఇపుడు దేశం మొత్తం వల్లెవేస్తుంది. నాడు 56 ప్రభుత్వ సేవలతో మొదలైన సచివాలయ వ్యవస్తలో ఇపుడు 545 సేవలు అందుబాటులోకి వచ్చాయంటే ఎవరికి మండల, జిల్లా కేంద్రానికి వెళ్లే అవసరం వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, అందే సేవలపై మరింతగా మండల, జిల్లా అధికారులు ద్రుష్టి సారిస్తే..గ్రామాలకొచ్చిన ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..