విశాఖ వేపగుంటకు చెందిన లక్ష్మీ బొడ్డేటి, భర్త రామక్రిష్ణ 4గురు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం శ్రీస్వామివారి దర్శనానికొచ్చారు. సింహాచలం కొండపై బస్టాప్ లోని మెట్లపై కూర్చొని తమ స్మార్ట్ ఫోన్ ను మరిచిపోయారు. ఒక వివాహ కార్యక్రమానికొచ్చిన చిన్నవాల్టేర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎం. మోహన్ కు ఆ సెల్ ఫోన్ దొరకడంతో పీఆర్వో ఆఫీసు దగ్గరున్న పోలీసులకు దానిని అందించారు. దీనితో పోగొట్టుకున్న బాధితులకు ఆ స్మార్ట్ ఫోన్ ను గోపాలపట్నం సీఐ ఎం. అప్పారావు ద్వారా ఆమెకు అప్పగించారు. ఈ సంబర్భంగా బాధితురాలు పోలీసులకు, ఆలయ అధికారులకు, దొరికిన ఫోన్ ను అప్పగించిన ఎం. మోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆటో డ్రైవర్ నిజాయితీని దేవస్థానం ఈఓ సూర్యకళ, సిఐలు అభినందించారు . భక్తులు సెల్ ఫోన్లు భద్రపరచుకునేందుకు పీఆర్వో ఆఫీసుదగ్గర, ఫ్రీదర్శనం క్యూ దగ్గర కౌంటర్లు ఏర్పాటుచేశామని, మొబైల్స్ ఎవరూ బయట ఎక్కడా పెట్టొద్దని ఈఓ తెలిపారు. భక్తులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని ఈఓ భరోసా ఇచ్చారు.