అర్హులైన పేదవారికందరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నాడు పెందుర్తి మండలం గుర్రంపాలెం లేఅవుట్ లో వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, స్థానిక ఎం ఎల్ ఎ ఎ. అధీప్ రాజ్ లతో కలిసి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెందుర్తి మండలంలోని గుర్రంపాలెం లో 11 ఎకరాలలో లే అవుట్ వేసి 454 ప్లాట్ లను చేసారని, రూ 8.13 లక్షలతో నీటి కనెక్షన్లు ఇచ్చారని, రూ. 89.60లక్షలు విద్యుదీకరణ పనులకు మంజూరు చేసారని , రూ 17.94 లక్షలు సైట్ లెవెలింగ్ చేయడానికి వినియోగించారని తెలిపారు. మెగా గ్రౌండింగ్ మేళా సందర్భంగా ఈ లే అవుట్ లో 100 గృహాలకు శంఖుప్థాపన చేయనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ నవరత్నాలు , పేదలందరికి ఇళ్లు పథకం కింద చేపట్టిన వై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో రెండవ దపా మెగా గ్రౌండింగ్ సందర్భ౧గా జిల్లాలో జూలై 1, 3,4 తేదీలలో గ్రౌండింగ్ చేస్తున్నట్టు తెలిపారు. లబ్దిదారులు గృహ నిర్మాణం పై పూర్తి శ్రద్ద వహించి పనులు చేయించాలని కోరారు. ప్రభుత్వం 20 టన్నుల ఇసుక లబ్దిదారునికి ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపారు. ఇంకా అవసరమైన స్టీలు, సిమెంటు గోదాములలో సిద్దంగా ఉందని తెలిపారు. వెై ఎస్ ఆర్ జగనన్న కాలనీలలో మౌళిక సదుపాయాలు, బోర్లు, ప్రతి ఇంటికి కొళాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, శానిటేషన్, విద్యుత్తు, రోడ్లు కల్పిస్తామని అన్నారు. అంగన్ వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. లబ్దిదారులను ప్రోత్సహించి ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
స్దానిక శాసన సభ్యులు ఎ. అదీప్ రాజ్ మాట్లాడుతూ పెందుర్తి నియోజక వర్గంలో 32వేల మందికి శాశ్వత గృహ వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వమే ఇసుక ధర , రవాణా ఖర్చులు భరించి తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇసుక తెప్పించి లబ్దిదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శ్రీనివాస్, నియోజక వర్గ ప్రత్యేకాధికారి హేమలత, మండల ప్రత్యేకాధికారి రాజు, ఎం ఆర్ ఓ పి.రామారావు, ఎం పి డి ఓ ఎస్ మంజుల వాణి, హౌసింగ్ డి ఇ రాజు, సర్పంచ్ గోవిందరాజులు పాల్గొన్నారు.