పేదోడిక గూడు కష్టం తీరుస్తున్న సీఎం..


Ens Balu
4
Narsipatnam
2021-07-01 11:55:34

ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం  కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. గురువారం మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా బలిఘట్టం సర్వేనెంబర్ 552  బైపురెడ్డిపాలెంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలలో  లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని ప్రతి నిరుపేద కు సొంత ఇల్లుకల నెరవేరుస్తున్నారన్నారు. ఇందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. జగనన్న కాలనీలలో త్రాగు నీరు, విద్యుత్తు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌలిక వసతులు అన్నింటిని కల్పించడం జరుగుతుందన్నారు. సొంత స్థలం ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం తరఫున రూ.1.80 లక్షల ను మంజూరు చేస్తూ వారికి సిమెంటు, ఐరన్,ఇసుక సబ్సిడీ ధరలకే అందించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసి వారి గృహప్రవేశాల కు సిద్ధం చేస్తామని అన్నారు. మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో నర్సీపట్నం ఇంచార్జ్ ఆర్ డి ఓ అనిత,  మున్సిపల్  చైర్పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ కనకారావు ,హౌసింగ్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
సిఫార్సు