మహిళా పోలీసులకు రెవిన్యూపై శిక్షణ..


Ens Balu
3
Sankhavaram
2021-07-01 13:07:55

మహిళా పోలీసులు రెవిన్యూశాఖ కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడానికి వీలుపడుతుందని తశహశీల్దార్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని 7వ బ్యాచ్  మహిళా పోలీసులకు రెవిన్యూ కార్యాలయంలోని వివిధ అంశాలపై ఆయన స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, శవపంచనామ, బైండోవర్లు, బీఎల్ఓ విధులు అత్యవసర సమయంలో సమాచారం చేరవేయడం తదితర విషయాలు ఏ విధంగా చేపట్టాలనే విషయంలో అవగాహన కల్పించారు. అంతేకాకుండా మహిళా పోలీసులకు రెవిన్యూ పరంగా మండల స్థాయిలో ఎప్పుడైనా తమ సహకారం అందిస్తామని, అదేవిధంగా సచివాలయ పరిధిలో వీఆర్వోలు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ పోలీసులుగా మహిళా పోలీసును మార్పుచేసినందున గ్రామాలకు రక్షణగా ఉండాలని సూచించారు.  అక్రమ మధ్యం, గొడవలు, అల్లర్లు, మహిళలపై వేధింపులు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు జీఎన్ఎస్ శిరీష, కళాంజలి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు