మెగా గ్రౌండింగ్ కి ముందుకి రావాలి..
Ens Balu
3
Samarlakota
2021-07-01 13:49:12
నవరత్నాలు -పేదలందరికి ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా లబ్దిదారులు తమ వంతు కృషి చేయాలనీ కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సామర్లకోట ఇటీసీ లే అవుట్ సామూహిక శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ డి. మురళీదర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ఇళ్ల పట్టాదారులందరుకు శుభాకాంక్షలు అని తెలిపారు. గతంలో ఇటీసీ లే అవుట్ లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అదే రోజు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల శంకుస్థాపన చేసుకోవాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ఈ రోజు లబ్దిదారులు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. అంతేకాకుండా మనకు ప్రధానంగా ఆర్థిక పెట్టుబడికి కొన్ని సమస్యలు తేలేత్తడం జరిగిందని, ఆ లోటు సరిదిద్దేవిధంగా మహిళల డ్వాక్రా రుణాలు ఆర్థిక పెట్టుబడిని వినియోగించుకుని నవరత్నాలు పేదలందరికి ఇల్లులుకు పెట్టడం జరుగుతుందని, ప్రభుత్వం నుండి కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రెమెంట్స్ రావడం ఆలస్యం కావచ్చు కానీ, పేదలందరికి ఇల్లు నిర్మాణానికి ప్రెమెంట్స్ ఎటువంటి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా నవరత్నాలు పేదలందరికి ఇల్లు మూడు రోజుల కార్యక్రమానికి 200కోట్ల రూపాయలు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ప్రతి ఇంటీకి జియో టాకింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారాయంత్రగంమంత సమిష్టి కృషితో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ చేతుల మీదుగా 883 మంది లబ్దిదారులకు సామజిక అవసరాల నిమిత్తం బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయంగా రూ.4,41,50,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాకినాడ ఆర్డీఓ చిన్ని కృష్ణ మాట్లాడుతూ సామర్లకోట పరిధిలో ఇళ్ల పట్టాలు మొత్తం 2200 దానిలో ఫస్ట్ ఫేస్ లో 1200 మందికి ఇవ్వడం జరిగిందని, ఈ రోజు 400 మంది పైగా హాజరు అవ్వడం జరిగిందని, వాలంటీర్లు, ప్లానింగ్ సక్రెటరీలు, ఇమ్మ్యూనిటీస్ ద్వారా హౌసింగ్ యాప్ అప్డేషన్ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా మెప్మా నుండి 125 బ్యాంకు రుణాల చెక్కులను అందజేయడం జరుగుతుందని తెలిపారు.అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా ఈ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్ (ఆసరా )జి. రాజకుమారి, హౌసింగ్ పిడి మెప్మా కె. శ్రీ రమణి, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్,తహసీల్దార్ జితేంద్ర, మునిసిపల్ కోఆప్షనల్ సభ్యులు ధవ్వులూరి సుబ్బారావు, వైస్ చైర్మన్ జాన్ మోజెస్, చైర్మన్ కృష్ణ మూర్తి, కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.