శంఖవరం మండల అభివ్రుద్ధి అధికారి కార్యాలయంలో 7వ బ్యాచ్చి మహిళా పోలీసులకు గురువారం క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓ జె.రాంబాబు ఆదేశాల మేరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నగేష్ మహిళా పోలీసులకు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే కార్యకాలపాలు, మెయింటేన్ చేసే రిజిస్టర్లు, అభివ్రుద్ధి పనులు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈసందర్బంగా సీనియర్ అసిస్టెంట్ మాట్లాడుతూ ప్రభుత్వం జీఓ నెంబరు 59 ద్వారా మహిళా పోలీసులను సాధారణ పోలీసులతో సమానంగా గుర్తించిన సందర్భంలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయ పరిపాలనపైనా అవగాహన పెంచుకోవడం ద్వారా అత్యవసర సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి వీలుపడుతుందన్నారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మహిళా పోలీసులకు సమాచారం అందించడానికి, విధి నిర్వహణలో సహాయ పడటానికి సిద్దంగా ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు జీఎన్ఎస్ శిరీష, కళాంజలి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.