ఐసీడిఎస్ పై మహిళా పోలీసులకి శిక్షణ..


Ens Balu
3
Sankhavaram
2021-07-02 07:25:28

ఐసీడిఎస్ కార్యకాలపాలపై మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని సూపర్ వైజర్ వి.అరుణశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం శంఖవరం మండల కేంద్రంలోని 7బ్యాచ్ మహిళా పోలీసులకు మహిళా శిసు సంక్షేమశాఖ కార్యాలయంలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  మహిళా పోలీసులకు గ్రామాల్లోని మహిళలకు రక్షణగా నిలవాలన్నారు. బాల్య వివాహాలు నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అమలు చేస్తు పౌష్టికాహార పథకం అమలు పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలన్నారు. అనంతరం కేంద్రాల్లో నిర్వహించే రికార్డులు, అంగన్వాడీల విధులు, సిడిపీఓ కార్యాలయం ద్వారా అందించే సేవలపైనా అవగాహన కల్పించారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఐసిడిఎస్ ద్వారా సేవలు అందించాలన్నారు. జీఓ నెంబరు 59 ద్వారా మహిళా పోలీసులను సాధారణ పోలీసులతో సమానంగా గుర్తించిన సందర్భంలో ప్రతీ ప్రభుత్వ కార్యాలయ పరిపాలనపైనా అవగాహన పెంచుకోవడం ద్వారా అత్యవసర సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి వీలుపడుతుందన్నారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా మహిళా పోలీసులకు సమాచారం అందించడానికి, విధి నిర్వహణలో సహాయ పడటానికి తాము సిద్దంగా ఉంటామనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు జీఎన్ఎస్ శిరీష, కళాంజలి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు