విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఇవిఎం) గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం గోదాములను తెరిచి, ఇవిఎంలను తనిఖీ చేసి, సీళ్లు వేశారు. సమీపంలోని పాత డ్వామా కార్యాలయంలో ఉన్న ఇవిఎంలను, ఇటీవలే ఖాళీ చేసిన ప్రస్తుత గోదాములోకి మార్చాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, నెల్లిమర్ల తాశీల్దార్ గొట్పాపు రాము, డిప్యుటీ తాశీల్దార్ సూర్యాకాంతం, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటిండెంట్ పి.రామకృష్ణ, నెల్లిమర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు, సిపిఐ ప్రతినిధి తాలాడ సన్నిబాబు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.