నేటి నాయకులకు వైఎస్సార్ ఒక దిక్సూచి...గిరిబాబు


Ens Balu
2
చీడిగుమ్మల
2020-09-02 10:24:57

దివంగత నేత వైఎస్సార్ గారి 11వ వర్ధంతి కార్యక్రమం చీడిగుమ్మలలో వైఎస్సార్సీపీ నేత గిరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ, దివంగత నేత స్ఫూర్తి తోనే వైఎస్సార్సీపీ పాలన శుభిక్షంగా సాగుతోందని అన్నారు. ఎన్నాళ్ళు బ్రతికాం అనేది కాదు.. ప్రజల గుండెల్లో నిలిచేలా కొన్నాళ్ళు బ్రతికినా చాలు అనే మాటతో రాజకీయాలలో విలువలు నింపిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని ప్రజాపాలనలో ముందుకు సాగుతామని చెప్పారు.  నేటి తరాల నాయకులకు వైఎస్సార్ ఒక మార్గ దర్శి అన్న గిరిబాబు ఆయన పేరుతో ప్రారంభ పార్టీలో, ప్రజలు సేవచేయడం ఆనందంగా వుందన్నారు. వైఎస్సార్ స్పూర్తితో నేడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజలకు 90శాతం అందించగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమం లో కసిరెడ్డి సత్యనారాయణ, మర్రి అప్పలనాయుడు, గండి శ్రీను, ఇటంశెట్టి రామక్రిష్ణ, లెక్కల అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.