మడమతిప్పని..మాట తప్పని నాయకుడు వైఎస్సార్
Ens Balu
1
ఏఎల్ పురం
2020-09-02 11:01:25
దివంగత నేత వైఎస్సార్ గారి 11వ వర్ధంతిని బుధవారం గొలుగొండ మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చిటికెల భాస్కరనాయుడు ఆధ్వర్యంలో ఏఎల్ పురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ అమర్ రహే,వైఎస్సార్ లాంగ్ లివ్, జోహార్ రాజన్న అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాస్కరనాయుడు మాట్లాడుతూ, మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు ఒకే ఒక్కడు వైఎస్సార్ అని కొనియడారు. ఆయన దయతో ఎంతో మందివిద్యార్ధులు ఉచితంగా చదువుకోవడానికి వీలుపడిందన్నారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడే ఆపద్భాందవి 108 అంబులెన్సుని ప్రవేశ పెట్టిన మహనీయుడని, ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రుత్తల రామకృష్ణ మహిళలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.