లబ్ధిదారులు భూపూజకి సిద్దమవ్వాలి..


Ens Balu
5
Bobbili
2021-07-03 11:26:15

 పేదలందరికీ  ఇళ్ళు క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన  గృహాలకు లబ్ధిదారులంతా  భూమి పూజ చేసుకొని ఇళ్ల నిర్మాణాలకు సిద్ధం కావాలని సంయుక్త కలెక్టర్  డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.  బొబ్బిలి మున్సిపాలిటీ లో శనివారం  మున్సిపల్ ఛైర్పర్సన్  పావు వెంకట కృష్ణ తో కలసి లబ్ధిదారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా జె.సి మాట్లాడుతూ గృహాల ప్రారంభలకు  ప్రభుత్వం  ఇచ్సిన గడువు ఆదివారం వరకూ ఉన్నందున ఇప్పటివరకు భూమి పూజ చేయని వారు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం  ఎంతో ఖర్చును భరిస్తూ పేదల కోసం నిర్మిస్తున్న గృహాలలో అన్ని రకాల సౌకర్యాలను, వసతులను కల్పిస్తోంద ని పేర్కొన్నారు.  ఎలాంటి వివాదాలు లేని గృహాలు స్వంతం అవుతాయని, ప్రతి ఒక్కరు నిర్మించుకోడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ సమావేశం లో బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ,  తహసీల్దార్ రామస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు