ఇళ్ల నిర్మాణాలు పండగలా జరగాలి..


Ens Balu
3
Etukuru
2021-07-03 12:07:22

పేదలందరికి ఇళ్ల పధకం క్రింద ఇంటి స్థలం పొందిన లబ్దిదారులందరూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం పేదలందరికి ఇళ్లు వైయస్సార్ జగనన్న కాలనీలలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో భాగంగా ఏటుకూరు లోని వైయస్సార్ జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల శంఖుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మాద్ ముస్తఫా తో కలిసి పాల్గొన్నారు. కాలనీలో ఇళ్ల నిర్మాణంకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లబ్దిదారులతో కలిసి శంఖుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు ఇసుక ఉచితంగా అందిస్తున్నదన్నారు. సిమెంట్, ఇనుము ఇతర గృహ నిర్మాణ సామాగ్రి రాయితీ పై అందిస్తున్నదన్నారు. శంఖుస్థాపనలు చేసిన ఇళ్లకు నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా లబ్దిదారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అధికారులు అందిస్తారన్నారు. మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో భాగంగా మొదటి రోజైన గురువారం ఇళ్లకు శంఖుస్థాపనలు చేసి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయటం జరిగిందన్నారు. లబ్దిదారులు స్వంత ఇంటి కల నిజం చేసుకునేందుకు అధికారులకు సహకరించి ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు మహ్మాద్ ముస్తఫా లబ్దిదారులతో మాట్లాడుతూ అధికారుల సహకారంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామన్నారు. ఇళ్లకు శంఖుస్థాపన కార్యక్రమానికి ముందు కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డివో భాస్కర్ రెడ్డి, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కమీషనరు చల్లా అనురాధ, తూర్పు మండల తహశిల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాసరావు, ఇ.ఇ.శాంతి రాజు, హౌసింగ్ ఇ.ఇ ప్రసాద్, సిటి ప్లానర్ సత్యానారాయణ, లబ్దిదారులు పాల్గొన్నారు.
సిఫార్సు