విశాఖజిల్లా, గొలుగొండ మండలం, ఏఎల్ పురం(క్రిష్ణదేవిపేట)లోని భావనా ఋషి, భద్రావతి, మార్కండేయ స్వామివారి ఆలయానికి దాతలు ఆర్ధికంగా సహకరించాలని నిర్వాహకులు చుక్కుల సత్యన్నారాయణ కోరుతున్నారు. శనివారం ఏఎల్ పురంలో ఆయన స్వామవారి ఆలయంలో మీడియాతో మాట్లాడారు. సుమారు 5సెంట్ల విస్తీర్ణంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసిన తరువాత తాత్కాలికంగా రేకుల షెడ్డుతో ఆలయం ఏర్పాటు చేసి నిర్వహణ చేస్తున్నామన్నారు. అయితే ఇపుడు స్వామివారికి పూర్తిస్థాయి శాస్వత నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దానికోసం దాతలు, స్వామివారి భక్తులు ఆలయ నిర్మాణానికి తోచిన విధంగా సహకారం అందించాలని కోరుతున్నారు. వస్తురూపంలోగానీ, సిమ్మెంటు, ఇసుక, ఇటుకలు, ఐరన్, టైల్స్ తదితర రూపంలో దాతలు తమ సహాయాన్ని సమర్పించవచ్చునన్నారు. ఆర్ధిక సహాయం చేయాలనుకునే వారు 9441571806, 9491792919 నెంబర్లుకు ఫోన్ పే చేయాలని కోరుతున్నారు. రూ.5లక్షలు సహాయం చేసిన వారిని మహారాజ పోషకులుగా గుర్తించి వారి పేరుతో జీవితాంతం స్వామిఆలయంలో పూజలు చేయిస్తామని చెప్పారు.