దేశంలోనే తిరుగులేని నేత దివంగత వైఎస్సార్...పర్వత


Ens Balu
2
శంఖవరం
2020-09-02 11:19:53

దేశంలోనే తిరుగులేని నేతగా దివంగ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరెడ్డి ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండి పోతారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని శంఖవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన మార్గదర్శకంలో జీవితాంతం కొనసాగుతామని చెప్పిన ఆయన అదే స్పూర్తిని నేడు ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహనరెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పారు. 108, ఉచిత విద్య, పేదవాడికి గూడు లాంటి పథకాలు కల్పించిన దేవుడు వైఎస్సార్ అని, అందుకే తెలుగు ప్రజలు ఆయనను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని అన్నారు. ఆ మహానేత మనలో లేకపోయినా ఆయన ప్రవేశ పెట్టిన పథకాల్లో ఎల్లప్పుడూ బతికే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.