అల్లూరి భావి యువతకు ఎంతో స్పూర్తి..


Ens Balu
5
Rowthulapudi
2021-07-04 06:37:57

అల్లూరి సీతారామరాజు నాడు గిరిజనులకు చేసి సేవలు, చైతన్య కార్యక్రమాలు బావిత రాలకు స్పూర్తిదాయకమని అన్నవరం శ్రీవీరవేంకట సత్యన్నారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు వాసిరెడ్డి జగన్నాధం అన్నారు. ఆదివారం అల్లూరి 124వ జయంతి సందర్భంగా రౌతులపూడిలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించి భారత దేశం నుంచి తరిమికొట్టిన అల్లూరి వీరోచి చరిత్ర, ఉద్యమం పోరాటం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆ మహాబావుని చరిత్ర మరింత పదిలంగా ఉండేందు పాఠ్యాంశాలల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో గుమ్మరేగల సర్పంచ్ ఆర్.రామక్రిష్ణ, ఉప్పంపాలెం సర్పంచి కోటిబాబు, బలరామపురం సర్పంచ్ తాతాజీ, ఎస్సీసెల నాయకుడు కె.రాజేశ్వర్రావు. తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు