అప్పన్నకు మేరీటైమ్ సీఈఓ పూజలు..
Ens Balu
4
Simhachalam
2021-07-04 06:50:55
సింహాచలం శ్రీశ్రీశ్రీ శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని(సింహాద్రి అప్పన్న) ఏపీ మేరీటైం బోర్డు సీఈఓ మురళీ ధరన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్నవారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రసాదం అందజేయగా, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆయనతో పాటు ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సిబ్బంది ఆయనకు వివరించారు.