సచివాలయాలతో సమస్యలకు పరిష్కారం..
Ens Balu
2
Pandrangi
2021-07-04 11:50:46
రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టి గ్రామ సచివాలయాల ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం గ్రామాల్లోనే లభిస్తుందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. ఆదివారం పాండ్రంగి గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయిలోనే సుమారు 14శాఖలకు చెందిన సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి క్రుషిచేస్తున్నారు. సచివాలయాల వలన రాబోయే రోజుల్లో గ్రామాల్లో ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అవసరం వుండదన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, కల్పనా కుమారి, ఆర్.గోవిందరావు, ఆర్.డి.ఒ.పెంచల కిషోర్, టూరిజం శాఖా ప్రాంతీయ సంచాలకులు, స్థానిక నాయకులు , అధికారులు పాల్గొన్నారు.