రామాలయానికి శంఖుస్థాపన..


Ens Balu
3
చవ్వా వారిపల్లె
2021-07-04 13:30:37

చవ్వా వారి పల్లిలో రూ.23.5 లక్షలతో రామాలయం నిర్మాణానికి టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్  హరి కిరణ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  భానుకోట శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. భానుకోట సోమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైందన్నారు. ఇక్కడి ప్రజలు, ఎంపి విజ్ఞప్తి మేరకు శ్రీవాణి నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులన్నీ రాతి కట్టడంతో చేస్తామని ఆయన తెలిపారు. చవ్వా వారి పల్లి ప్రజలు, సర్పంచ్ కోరిక మేరకు అ గ్రామంలో కూడా రూ 23. 50 లక్షలతో రామాలయం నిర్మించనున్నామని ఆయన వివరించారు.
సిఫార్సు