దిశ యాప్ మహిళలకు ధృడమైన రక్షణ


Ens Balu
1
Sankhavaram
2021-07-05 07:15:45

దిశ యాప్ మహిళా విద్యార్ధినిలకు దృఢమైన రక్షణగా ఉంటుందని సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష అన్నారు. సోమవారం గ్రామసచివాలయం-1లో విద్యార్ధినిలతో దిశ యాప్ ఇనిస్టాల్ చేయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ మాట్లాడుతూ, దిశయాప్ మహిళల పాలిట సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుందన్నారు. ప్రతీ మహిళా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ఇనిస్టాల్ చేయించు కోవాలన్నారు. తోటి విద్యార్ధినిలకూ ఈ విషయాన్ని తెలియ జేయాలన్నారు.
సిఫార్సు