శునకాలకు యాంటీ రేబీస్ టీకాలు..


Ens Balu
3
Paderu
2021-07-06 12:11:16

 ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 212 పెంపుడు శునకాలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేశారు. శునకాలకు మల, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహించారు. మంగళవారం స్థానిక ఏరియా పశువైద్య శాలలో నిర్వహించిన వాక్సినేషన్ కార్యక్రమంలో పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆధునీకరణ చేసిన ఆపరేషన్ ధియేటర్ ను ఆమె ప్రాంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ జూనోసిస్ వ్యాధులపై  ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  స్వచ్చంధ సంస్థల సహకారంతో పెంపుడు శునకాలతో పాటు వీధి శునకాలకు టీకాలు వేయాలని సూచించారు. అనంతరం ఇండియన్ ఇమ్యునాలజికల్స్,ఇంటాస్, విర్దాక్ తదితర ఫార్మా సంస్థలకు చెందిన షాంపూలు, డీవార్మింగ్ మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పాడేరు సర్పంచ్ కె.ఉషారాణి, పశుసంవర్ధక శాఖ, సహాయ సంచాలకులు డా.ఏ.రవికుమార్ ,డా.సతీష్, డా.జగదీష్ , లైవ్ స్టాక్ అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు